India Evacuation Ukraine: ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపించనుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, జ్యోతిరాధిత్య సింధి యా, కిరెణ్ రిజిజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.
రొమేనియా, మోల్డోవా నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను సింధియా చూసుకోనున్నారు. కిరెన్ రిజుజు స్లొవేకియా, హర్దీప్ సింగ్ హంగేరి, వీ కే సింగ్ పోలాండ్ వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్తోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఉక్రెయిన్లోని పరిణామాలపై ఆదివారం కూడా ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.