తమ దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్టు భారత్‌పై ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. దాయాది దేశం చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పాక్ పన్నుతున్న ఉగ్రకుట్రలు ప్రపంచ దేశాలకు తెలుసని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ విమర్శించారు. ఆ దేశ వ్యూహాల గురించి పసిగట్టవచ్చని.. ఉగ్రవాదులకు అండగా నిలిస్తున్నట్టు ఆ దేశ నాయకులే అంగీకరించారని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో పాక్‌లో జరిగిన దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి.. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆరోపించారు. అయితే.. ఇవి అనాలోచిత వ్యాఖ్యలని చెప్పిన శ్రీవాస్తవ.. ఆధారాల్లేని వాదనలు ఎప్పటికీ విశ్వసనీయతను పొందలేవన్నారు.