భారత్‌లో మరో ఏడు కొవిడ్ టీకాలు అభివృద్ధి అవతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. దేశ పౌరులందరికీ టీకా అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడప్పుడే.. వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లో విడుదల చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. 50 ఏళ్లు దాటిన వ్యక్తులకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని మార్చి నుంచి ప్రారంభమిస్తామని చెప్పారు.
"మేం కేవలం రెండు టీకాలపైనే ఆధారపడటం లేదు. దేశీయంగా మరో ఏడు టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారత్ అతిపెద్ద దేశం. అందరికీ టీకా అందాలంటే మరిన్ని వ్యాక్సిన్లు అవసరం. ఈ వ్యాక్సిన్లలో మూడు ట్రయల్ దశలో ఉన్నాయి. రెండు ముందస్తు క్లినికల్ దశలో ఉన్నాయి. ఒక టీకా తొలి దశ, మరో రెండు రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి."