తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 3.11లక్షల కేసులు.. 4వేల మరణాలు - covid cases india

దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3.11లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే మరణాలు మాత్రం మరోసారి 4వేలకు పైగా నమోదయ్యాయి.

INDIA DAILY COVID CASES
భారత్ రోజువారీ కేసులు, ఇవాళ్టి కరోనా కేసులు, తెలుగు వార్తలు

By

Published : May 16, 2021, 9:45 AM IST

Updated : May 16, 2021, 10:29 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి తగ్గాయి. తాజాగా 3,11,170 ‬లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. అయితే, కేసులు తగ్గినా.. మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఒక్కరోజే 4077మంది మరణించారు.

  • మొత్తం కేసులు: 2,46,84,077‬
  • మొత్తం మరణాలు: 2,70,284
  • కోలుకున్నవారు: 2,07,95,335
  • యాక్టివ్ కేసులు: 36,18,458

శనివారం 18,32,950 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 31,48,50,143కి చేరిందని తెలిపింది.

Last Updated : May 16, 2021, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details