తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోరుగా వ్యాక్సినేషన్​- 5 కోట్లకుపైగా డోసులు పంపిణీ - కరోనా వ్యాక్సినేషన్​

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చేపట్టిన టీకా పంపిణీలో మరో మైలురాయిని చేరుకుంది భారత్​. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం ఐదు కోట్ల మంది లబ్ధిదారులకు కొవిడ్​ వ్యాక్సిన్​ సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India crosses 5 crores milestone in Covid-19 vaccination
భారత్​లో 5 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్​

By

Published : Mar 24, 2021, 5:26 AM IST

దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు.. మొత్తం 5కోట్ల 75వేలకుపైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో మంగళవారం(67వ రోజు) ఒక్కరోజే 32.53 లక్షల టీకా డోసులు అందించినట్లు పేర్కొంది.

  • వ్యాక్సిన్​ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 79,03,068 మంది తొలి డోసు వేయించుకోగా.. 50,09,252 మంది రెండో మోతాదు తీసుకున్నారు.
  • 83,33,713 లక్షల మంది కరోనా యోధులు(ఫ్రంట్​లైన్​ వర్కర్స్​) కరోనా టీకా మొదటి డోసు తీసుకోగా.. 30,60,060 మంది రెండో డోసు అందుకున్నారు.
  • 60 ఏళ్లు పైబడిన 2,12,03,700 మందికి వ్యాక్సిన్​ మొదటి మోతాదు అందించారు.
  • 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారిలో 45,65,369 మందికి తొలి డోసు పంపిణీ చేశారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. ఆ తర్వాత.. ఫిబ్రవరి 2 నుంచి కరోనా యోధులకు; మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అనారోగ్యంతో సంబంధం లేకుండా.. ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు మించిన వారందరికీ వ్యాక్సిన్​ సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది.

ఇదీ చదవండి:'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details