India covid cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తేపోలిస్తే స్పల్పంగా తగ్గాయి. కొత్తగా 6,650 మంది వైరస్ బారినపడ్డారు. మరో 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 7,051 మంది వైరస్‌ను జయించారు.
మొత్తం కేసులు:3,47,72,626
మొత్తం మరణాలు:4,79,133
యాక్టివ్ కేసులు:77,516
కోలుకున్నవారు:3,42,15,977
Vaccination in India:
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 57,44,652 వ్యాక్సిన్ డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,40,31,63,063కు చేరింది.
ఒంటెపై వెళ్లి..
'ఇంటింటికీ టీకా' కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ బాడ్మేర్కు చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త భారీ సాహసం చేశారు. ఎడారి ప్రాంతంలో ఒంటెపై ప్రయాణించి.. ఓ మారుమూల గ్రామానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలకు టీకా వేశారు. ఈ ఫొటోలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా షేర్ చేశారు.
ఎడారి ప్రాంతంలో టీకా వేసేందుకు ఒంటెపై వెళ్తున్న ఓ ఆరోగ్య కార్యకర్త ఒంటెపై వెళ్లి గ్రామస్థులకు టీకా వేస్తున్న ఆరోగ్య కార్యకర్త Covid tests in india:
గురువారం ఒక్కరోజే 11,65,887 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 66,98,09,816కు చేరిందని చెప్పింది.
Omicron in india:
మరోవైపు.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 358కి చేరింది.
Covid world cases:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 9,73,256 కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,562 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 27,85,02,538కి చేరగా మొత్తం మరణాల సంఖ్య 54,00,364కు పెరిగింది.
- అమెరికాాలో కొవిడ్ విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 2,67,269 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 1,149 మంది ప్రాణాలు కోల్పోయారు. 56,847 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- బ్రిటన్‌లో కొత్తగా 1,19,789 మంది కరోనా బారినపడ్డారు. మరో 147మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,47,720కు పెరిగింది.
- ఫ్రాన్స్‌లో 91,608 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. 179 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 88,89,636కు చేరింది.
- రష్యాపై కరోనా పంజా విసురుతోంది. ఆ దేశంలో కొత్తగా 25,667 మంది వైరస్ బారినపడగా.. మరో 1,002 మంది కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు.
ఇవీ చూడండి: