తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? - భారత్​లో కొవిడ్​ కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 16,678 మంది కొవిడ్ బారినపడ్డారు. 26 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

india covid cases
india covid cases

By

Published : Jul 11, 2022, 9:38 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,678 మంది వైరస్​ బారినపడగా.. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 14,629మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.51 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.99 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు: 43,639,329
  • మొత్తం మరణాలు: 5,25,454
  • యాక్టివ్​ కేసులు: 1,30,713
  • కోలుకున్నవారి సంఖ్య:4,29,83,162

Vaccination India: భారత్​లో ఆదివారం 11,44,145 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,88,77,537కు చేరింది. మరో 2,78,266 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,11,725 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,06,54,133 కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,73,019 మంది మరణించారు. ఒక్కరోజే 5,15,132 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,36,69,803కు చేరింది.

  • ఇటలీలో కొత్తగా 79,920 మందికి వైరస్​ సోకగా.. 44 మంది మరణించారు.
  • జపాన్​​లో 51,738 మంది వైరస్​ బారిన పడ్డారు. 13మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికా​లో ఒక్కరోజే 23,939 మంది కొవిడ్​ బారినపడగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మెక్సికోలో 32,195 మంది వైరస్​ బారిన పడ్డారు. 55 మరణించారు.
  • ఆస్ట్రేలియా​లో 31,406 కేసులు నమోదు కాగా.. 13 మంది మరణించారు.

ఇవీ చదవండి:దక్షిణాదిపై భాజపా గురి.. '2024' కోసం పక్కా ప్లాన్​తో..

గోవాలో కాంగ్రెస్​కు షాక్​.. ఐదుగురు ఎమ్మెల్యేలు దూరం.. త్వరలో భాజపాలోకి?

ABOUT THE AUTHOR

...view details