India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. వరుసగా రెండోరోజూ 30 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 30,757 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 541 మంది మరణించారు. 67,538 మంది బాధితులు కోలుకున్నారు.
- మొత్తం కేసులు:4,27,54,315
- మొత్తం మరణాలు:5,10,413
- యాక్టివ్ కేసులు:3,32,918
- మొత్తం కోలుకున్నవారు:4,19,10,984
Covid Tests in India:దేశవ్యాప్తంగా బుధవారం 11,79,705 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,54,64,684కు చేరింది.
Vaccination in India:
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగానే కొనసాగుతోంది. బుధవారం మరో 34,75,951 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,74,24,36,288కు చేరింది.
World Covid cases:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 20 లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. జర్మనీ, రష్యా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది.
- జర్మనీలో కొత్తగా 2.34 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది మృతి చెందారు.
- రష్యాలో లక్షా 79 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. 748 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 24 గంటల్లో వెయ్యి మందికి పైగా కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా 1.47 లక్షల కేసులు బయటపడ్డాయి.
- అమెరికాలో కరోనా... మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల్లో 2802 మంది ప్రాణాలను వైరస్ తోడేసింది. లక్షా 14 వేల కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:కొవిడ్ ఆంక్షలను ఎత్తేస్తున్న రాష్ట్రాలు