Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్ నుంచి 12,456 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది.
- మొత్తం కేసులు: 4,35,31,650
- మొత్తం మరణాలు: 5,25,242
- యాక్టివ్ కేసులు: 1,14,475
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,91,933
Vaccination India: భారత్లో సోమవారం 11,44,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.