Covid Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,135 మంది వైరస్ బారినపడగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 13,958 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.85శాతానికి ఎగబాకింది.
- మొత్తం మరణాలు: 5,25,223
- యాక్టివ్ కేసులు: 1,13,864
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,79,477
Vaccination India: భారత్లో ఆదివారం 1,78,383 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,98,21,197కు చేరింది. మరో 3,32,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,36,614 మంది వైరస్ బారినపడ్డారు. మరో 566 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,43,43,968కు చేరింది. మరణాల సంఖ్య 63,61,372 చేరింది. ఒక్కరోజే 485,179 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 529,190,953కు చేరింది.
- ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఒక్కరోజే 71వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తైవాన్లో 32,681 కేసులు బయటపడగా.. 88 మంది తుది శ్వాస విడిచారు.
- ఆస్ట్రేలియాలో కొత్తగా 30,282 మందికి వైరస్ సోకగా.. 30 మంది మరణించారు.
- బ్రెజిల్లో ఒక్కరోజే 25,549 మంది కొవిడ్ బారినపడగా.. 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మెక్సికోలో 24,610 కేసులు నమోదు కాగా.. 28 మంది మరణించారు.
ఇదీ చదవండి:'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు