Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 16,103 మంది వైరస్ బారినపడగా.. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 13,929 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.27%గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,34,86,326
- మొత్తం మరణాలు: 5,25,199
- యాక్టివ్ కేసులు: 1,11,711
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,65,519
- Vaccination India: భారత్లో శనివారం 10,10,652 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,95,72,963 కోట్లకు చేరింది.