Covid Cases in India: దేశంలో కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 17,092 మంది వైరస్ బారినపడగా.. మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 14,684 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.25 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.14%గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,34,86,326
- మొత్తం మరణాలు: 5,25,168
- యాక్టివ్ కేసులు: 1,09,568
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,51,590
Vaccination India: భారత్‌లో శుక్రవారం 9,09,776 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,84,80,015 కోట్లకు చేరింది. మరో 4,12,570 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 824,945 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,502 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,26,48,933కు చేరింది. మరణాల సంఖ్య 6,359,970 చేరింది. ఒక్కరోజే 449,286 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 528,318,991గా ఉంది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 125,066 కొత్త కేసులు బయటపడగా.. 52 మంది మరణించారు.
- అమెరికాలో 102,788 కేసులు వెలుగుచూశాయి. 283 మందికిపైగా చనిపోయారు.
- జర్మనీలో కొత్తగా 98,669మందికి వైరస్ సోకగా.. 284 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీ ఒక్కరోజే 86,334 మంది కొవిడ్ బారినపడగా.. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 75,749 కేసులు నమోదు కాగా.. 298 మంది మరణించారు.
ఇదీ చదవండి:'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు