Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,615 మంది వైరస్ బారినపడగా.. మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 3.23 శాతానికి తగ్గింది.
- మొత్తం మరణాలు: 5,25,474
- యాక్టివ్ కేసులు: 1,31,043
- కోలుకున్నవారి సంఖ్య: 4,29,96,427
Vaccination India: భారత్‌లో సోమవారం 10,64,038 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది. మరో 4,21,292 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,72,560 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,157 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,16,51,697 కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,74,666 మంది మరణించారు. ఒక్కరోజే 8,41,647 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,45,32,814కు చేరింది.
- జర్మనీలో కొత్తగా 1,54,729 మంది కరోనా బారిన పడ్డారు. 165 మంది మరణించారు.
- అమెరికాలో ఒక్కరోజే 57,970 మంది కొవిడ్ బారినపడగా.. 122మంది ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్‌లో 50,918 మంది వైరస్ బారిన పడ్డారు. 10మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 44,043 మంది వైరస్ బారిన పడ్డారు. 155 మరణించారు.
- ఇటలీలో కొత్తగా 37,756 మందికి వైరస్ సోకగా.. 127మంది మరణించారు.