India Covid cases: భారత్‌లో రోజువారి కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 71,365 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 1,217 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 1,72,211మంది వైరస్‌ను జయించారు.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు:4,24,10,976
- మొత్తం మరణాలు:5,05,279
- యాక్టివ్ కేసులు:8,92,828
- మొత్తం కోలుకున్నవారు:4,10,12,869
దేశంలో కొత్తగా 53,61,099 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,70,87,06,705 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 21 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 11,785 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,81,546కు చేరింది.
- జర్మనీలో కొత్తగా 2,12,724 లక్షల మందికి వైరస్ బారినపడ్డారు. మరో 231 మంది ప్రాణాలు కోల్పాయారు.
- అమెరికాలో ఒక్కరోజే 1,79,169 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 2,777 మంది మృతి చెందారు.
- రష్యాలో కొత్తగా 1.65 లక్షల మందికి కరోనా సోకింది. 698 మంది మృతి చెందారు.
- టర్కీలో తాజాగా 11,1096 కేసులు బయటపడగా.. 241 మంది బలయ్యారు.
- బ్రెజిల్లో ఒక్కరోజే 1,71,483 మందికి వైరస్ సోకింది. మరో 1,174 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి:కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..