India Covid Cases: భారత్‌లో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,245,517
- మొత్తం మరణాలు: 5,24,792
- యాక్టివ్ కేసులు: 53,637
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,67,088
Vaccination India: భారత్‌లో మంగళవారం 13,58,607 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,50,87,271 కోట్లకు చేరింది. మరో 4,40,278మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 583,971 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,315 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 541,696,662కు చేరింది. మరణాల సంఖ్య 6,334,114కు చేరింది. ఒక్కరోజే 582,272 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 516,183,780గా ఉంది.
- జర్మనీలో ఒక్కరోజే 83 వేలకుపైగా కొవిడ్ బారినపడ్డారు. మరో 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 72,312 కేసులు వెలుగుచూశాయి. మరో 272 మందికిపైగా చనిపోయారు.
- తైవాన్‌లో మరో 66,189 కేసులు, 123కుపైగా మరణాలు నమోదయ్యాయి
- ఫ్రాన్స్‌లో 65,425 కేసుల నమోదయ్యాయి. 57 మంది మరణించారు.
- బ్రెజిల్లో 40 వేల కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి.