India covid cases: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 4,28,22,473
- మొత్తం మరణాలు: 5,11,903
- యాక్టివ్ కేసులు: 2,24,187
- మొత్తం కోలుకున్నవారు: 4,20,86,383
Vaccination in India:
దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 30,81,336 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,37,22,697కు చేరింది.
World Covid cases:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 15,90,061 కేసులు బయటపడ్డాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- రష్యాలో తాజాగా లక్షా 79 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 798 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 51 లక్షలు దాటింది.
- జర్మనీలో 1.37 లక్షల కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 133 మంది కరోనాకు బలయ్యారు.
- బ్రెజిల్లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 827 మంది చనిపోయారు. కొత్తగా లక్షా మూడు వేల కేసులు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియాలోనూ లక్షకు పైగా కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 71 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇండోనేసియా దేశాల్లోనూ వైరస్ విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి:కొవిడ్‌పై అలా వ్యవహరించడం మంచిది కాదు: డబ్ల్యూహెచ్ఓ