తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,326‬ కేసులు - india coronavirus

India Covid cases: దేశంలో కొత్తగా 5,326‬ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు.

india covid
కొవిడ్

By

Published : Dec 21, 2021, 9:36 AM IST

India Covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 5,326‬ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 79,097కు తగ్గింది.

మొత్తం కేసులు:3,47,52,164

మొత్తం మరణాలు: 4,78,007

యాక్టివ్ కేసులు: 79,097

కోలుకున్నవారు: 3,41,95,060

Vaccination in India:

దేశంలో టీకా పంపిణీ శరవేగంగానే కొనసాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కు చేరింది.

Covid World cases:

ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ వాటానే అధికంగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 5,45,626 కేసులు నమోదయ్యాయి. 4,939 మంది మరణించారు.

  • అమెరికాలో మరో లక్షా 43 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 623 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,28,836కు చేరుకుంది.
  • యూకేలో మరో 91,743 కరోనా కేసులు నమోదయ్యాయి. 44 మంది చనిపోయారు. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ వాటా క్రమంగా పెరుగుతోందని ఆ దేశ వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • రష్యాలో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరో 1,019 మంది వైరస్​కు బలయ్యారు. కొత్తగా 27 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరువవుతోంది.

ఇదీ చదవండి:కరోనా​ కొత్త కేసుల్లో 73శాతం ఒమిక్రాన్​ బాధితులే

ABOUT THE AUTHOR

...view details