దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. 24 గంటల వ్యవధిలో 7,081 కేసులు నమోదయ్యాయి. మరో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,469మంది కోలుకున్నారు.
మొత్తం కేసులు: 3,47,40,275
మొత్తం మరణాలు: 4,77,422
యాక్టివ్ కేసులు: 83,913
కోలుకున్నవారు: 3,41,78,940
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 76,54,466 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,46,13,252కు చేరింది.
Covid world cases
అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 5,57,866 కేసులు వెలుగులోకి వచ్చాయి. 5,156 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 90 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 125 మంది మరణించారు. 13 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- అమెరికాాలో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. కొత్తగా 85 వేల కేసులు వెలుగుచూశాయి. 487 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 8 లక్షల 27 వేలు దాటింది.
- ఫ్రాన్స్‌లో 58 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 85 లక్షల 77 వేలకు చేరుకుంది.
- రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. మరో 1,076 మంది కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు. ఆ దేశంలో 27 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చదవండి:Uk Lockdown: బ్రిటన్‌లో రెండు వారాలపాటు లాక్డౌన్?