India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 58,097 కేసులు వెలుగుచూశాయి. మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. 15,389 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు:4,82,551
- యాక్టివ్ కేసులు:2,14,004
- కోలుకున్నవారు:3,43,21,803
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 96,43.238 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,47,72,08,846 కు చేరింది.
చిన్నారులకు వ్యాక్సినేషన్..
Vaccination For 15 To 18 Years: దేశంలో ఇప్పటివరకు 85లక్షల మంది 15-18ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు అత్యధికశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటివరకు39.8 శాతం మంది పిల్లలకు టీకా వేశారు. తరువాతి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ 37శాతం, గుజరాత్ 30శాతం ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 'టీనేజ్ వ్యాక్సినేషన్' కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15-18ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,135కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
corona cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 21 లక్షల 44వేల 095 కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,656 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 5,67,696 కేసులు నమోదయ్యాయి.1,847మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,51,439చేరింది.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,18,724కేసులు నమోదయ్యాయి.48మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- ఫ్రాన్స్‌లో2,71,686 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 351మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 65,443కు చేరింది.
- ఇటలీలో1,70,844 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 222మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 65,66,947కు పెరిగింది. మరణాల సంఖ్య 1,38,045కు చేరుకుంది.
- టర్కీలో కొత్తగా 54,724 కేసులు నమోదు అయ్యాయి. 137 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.