తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid cases: దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు - కరోనా న్యూస్

దేశంలో మరో 41 వేల కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 518 మంది చనిపోయారు. 42,004 మంది కోలుకున్నారు.

covid cases
భారత్ కరోనా కేసులు

By

Published : Jul 18, 2021, 9:40 AM IST

దేశంలో కొత్తగా 41,157 ‬కరోనా కేసులు బయటపడ్డాయి. శనివారం నాటి కేసులతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కరోనాతో మరో 518 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,004 మంది వైరస్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,11,06,065‬
  • మరణాలు: 4,13,609
  • కోలుకున్నవారు: 3,02,69,796
  • యాక్టివ్ కేసులు: 4,22,660

40 కోట్ల టీకా డోసుల పంపిణీ..

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం 51,01,567 డోసులు లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 40,49,31,715కు చేరుకుంది.

శనివారం.. దేశవ్యాప్తంగా 19,36,709 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం నమూనా పరీక్షల సంఖ్య 44,39,58,663కు చేరినట్లు స్పష్టం చేసింది.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,84,357 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఏకంగా 7191 మంది ఒక్కరోజులోనే ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19 కోట్ల ఏడు లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 40 లక్షల 98 వేలకు చేరింది.

పలు దేశాల్లో కొత్త కేసులు ఇలా..

  • బ్రిటన్: 54,674
  • ఇండోనేసియా: 51,952
  • బ్రెజిల్: 34,339
  • రష్యా: 25,116
  • అమెరికా: 24,081

ABOUT THE AUTHOR

...view details