భారత్లో కరోనా కేసులు(Covid 19 india) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,164 మందికి వైరస్ సోకింది. మరో 499 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 38,660 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు:3,11,44,229
- మొత్తం మరణాలు:4,14,408
- కోలుకున్నవారు:3,03,08,456
- యాక్టివ్ కేసులు:4,21,665
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 40,64,81,493 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 13,63,123 డోసులు అందించినట్లు తెలిపింది.
ఆదివారం ఒక్కరోజే 14,63,593 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.