తెలంగాణ

telangana

ETV Bharat / bharat

India covid cases: దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు - ఇండియా కరో నా మరణాలు

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 11,850 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ ధాటికి మరో 555 మంది మరణించారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Nov 13, 2021, 9:31 AM IST

Updated : Nov 13, 2021, 10:25 AM IST

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 11,850 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 555 మంది మృతి చెందారు. రికవరీ రేటు 98.26గా నమోదైంది. యాక్టివ్ కేసులు 0.4 శాతం మేర తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు:3,44, 26,036
  • మొత్తం మరణాలు: 4,63,245
  • యాక్టివ్​ కేసులు: 1,36,308
  • కోలుకున్నవారు: 3,38,26,483

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 58,42,530 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,11,40,48,134కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,04,789 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,188 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,31,89,293 కు చేరింది. మొత్తం మరణాలు 51,03,699కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 90,208 మందికి వైరస్​ సోకింది. మరో 987 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 40,123 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,235 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 40,375 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 145 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 23,637 కరోనా​ కేసులు నమోదవగా.. 217 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 48,184 మందికి కొవిడ్ సోకింది. 228 మంది మరణించారు.

ఇదీ చదవండి:వైద్య రంగంలో విస్తరిస్తున్న పరిశోధనలు

Last Updated : Nov 13, 2021, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details