INDIA COVID CASES: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 1,086 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇవి 291 అధికం. కాగా, మహమ్మారి ధాటికి మరో 71మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు.. 0.03 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వెల్లడించింది. 1,198 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో 1,086 మందికి వైరస్ - new covid death
INDIA COVID CASES: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మరో 71 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 12 వేల దిగువకు పడిపోయాయి.
INDIA COVID CASES
• యాక్టివ్ కేసులు: 11,871
• మరణాలు: 5,21,487
• మొత్తం కేసులు: 43,030,925
• రికవరీలు: 4,24,97,567
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 15,49,699 మందికి మంగళవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.04 కోట్లకు చేరింది.
• మంగళవారం 4,81,374 కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇదీ చదవండి:యూట్యూబ్ వీడియోలు చూసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ల చోరీ