India covid cases: దేశంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 795 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 58 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 0.17 శాతానికి పడిపోయింది. వీక్లీ పాజిటివ్ రేటు 0.22 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,054కు చేరిందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ఇవి మొత్తం కేసుల్లో 0.03 శాతమని తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వెల్లడించింది. 1,280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
• మొత్తం కేసులు: 4,30,29,839
• యాక్టివ్ కేసులు: 12,054
• రికవరీలు: 4,24,96,369
• మొత్తం మరణాలు: 5,21,416