భారత్‌లో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 10,488 మందికి కొవిడ్ (Corona cases in India) పాజిటివ్‌గా తేలింది. వైరస్ (Coronavirus India) ధాటికి మరో 313 మంది మరణించారు. ఒక్కరోజే 12,329 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 98.30 శాతానికి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 2020 మార్చి నుంచి 0.36 శాతానికి తగ్గి.. 532 రోజుల కనిష్ఠానికి చేరింది.
దేశంలో రోజువారీ కేసులు వరుసగా 44వ రోజు 20 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 147 రోజులుగా రోజువారీ వైరస్ కేసులు 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతో గచిడిన 48 రోజులుగా పాజిటివిటీ రేటు 2 శాతానికి(0.98) దిగువన నమోదవుతోంది. 58 రోజులుగా వారాంత (వీక్లీ) పాజిటివిటీ రేటు 2 శాతం (0.94శాతం) కంటే తక్కువగా ఉంది.
- మొత్తం కేసులు :3,45,10,413
- మొత్తం మరణాలు :4,65,662
- యాక్టివ్ కేసులు :1,22,714
- కోలుకున్నవారు :3,39,22,037
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,25,970 డోసులు అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,16,50,55,210కి చేరింది.
పరీక్షలు