India Covid cases: భారత్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 30,615 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ ధాటికి మరో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,988 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:4,27,23,558
- మొత్తం మరణాలు:5,09,872
- యాక్టివ్ కేసులు:3,70,240
- మొత్తం కోలుకున్నవారు:4,18,43,446
Covid Tests in India:దేశవ్యాప్తంగా మంగళవారం 12,51,677 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,42,84,979కు చేరింది.
Vaccination in India:
దేశంలో సోమవారం 41,54,476 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,73,86,81,675 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World corona cases:
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 19,00,985 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 41,57,78,024గా ఉండగా.. మరణాల సంఖ్య 58,55,707కు చేరింది.
- అమెరికాలో 94 వేల కొత్త కేసులు.. 2,202 మరణాలు నమోదయ్యాయి.
- జర్మనీలో ఒక్కరోజే 1.77 లక్షల మందికి పైగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 214 మంది మృతిచెందారు.
- రష్యాలో మరో 1.66 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 704 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 1.42 వేల మందికి పైగా కరోనా సోకింది. 390 మంది మరణించారు.
- టర్కీలో తాజాగా 94 వేల కేసులు బయటపడగా.. 309 మంది బలయ్యారు.
ఇవీ చూడండి:పంజాబ్‌లో డేరాల మద్దతు కోసం రాజకీయ పార్టీల తహతహ