తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా మరో 796 మందికి వైరస్​.. పెరిగిన మరణాలు - కొవిడ్ టీకా ఇండియా

దేశంలో కొత్తగా 796 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 946 మంది కోలుకున్నారు. మరోవైపు సోమవారం దేశవ్యాప్తంగా 15,65,507 టీకాలను కేంద్రం పంపిణీ చేసింది.

covid cases in india
ఇండియాలో కొవిడ్ కేసులు

By

Published : Apr 12, 2022, 10:09 AM IST

India Covid Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 796 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 946 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. సోమవారంతో పోల్చితే కేసులు తగ్గినప్పటికీ మరణాలు స్వల్పంగా పెరిగాయి. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 10,889 ఉన్నాయి.

• యాక్టివ్ కేసులు: 10,889
• మరణాలు: 5,21,710
• మొత్తం కేసులు: 4,30,36,968
• రికవరీలు:4,25,04,329

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 15,65,507 మందికి సోమవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.90 కోట్లకు చేరింది. 4,06,251 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,45,25,202 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 545,832 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,027 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • దక్షిణ కొరియాలో తాజాగా 90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. 258 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 92,639 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 2,03,800 మంది కోలుకున్నారు.
  • జపాన్​లో తాజాగా 47,876 మంది వైరస్​ సోకింది. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో 42,726 కరోనా కేసులు బయటపడ్డాయి. ఐదుగురు మృతి చెందారు.
  • ఇటలీలో 28,368 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.115 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. తీవ్రంగా హింసించి గ్యాంగ్​రేప్

ABOUT THE AUTHOR

...view details