తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 'కిమ్'​ రాజ్యంలో ఒక్కరోజే లక్ష​మందికి! - India corona cases

India Covid cases: భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 3,712 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 2584 మంది కోలుకున్నారు.

India Covid Cases
India Covid Cases

By

Published : Jun 2, 2022, 9:37 AM IST

India Corona cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మరో 3,712 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. బుధవారం 2500 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి పెరిగింది.

దేశంలో మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి. నిన్నమొన్నటి వరకు స్థిరంగా నమోదైన కేసులు.. బుధవారం ఒక్కసారే 1081 మందికి వైరస్​ సోకింది. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో బుధవారం నాటికి 3,475 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. అందులో దాదాపు 2,500 కేసులు ముంబయి ప్రాంతానికే చెందినవని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపె చెప్పారు.

  • దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,64,544
  • మొత్తం మరణాలు: 5,24,641
  • యాక్టివ్​ కేసులు: 19,509
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,20,394

Vaccination India: దేశవ్యాప్తంగా బుధవారం 12,44,298 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,70,51,104కు చేరింది. ఒక్కరోజే 4,41,989 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

Global Covid Tracker: ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు భారీగానే పెరిగాయి. కొత్తగా 5 లక్షల 70 వేలమందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1420 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 533,404,370కు చేరింది. మరణాల సంఖ్య 6,315,642కు చేరింది. ఒక్కరోజే 543,383 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 504,236,117గా ఉంది.

  • ఉత్తర కొరియాలో రికార్డు స్థాయిలో రోజుకు సగటున లక్ష కేసులు వెలుగుచూస్తున్నాయి.
  • అమెరికాలో బుధవారం 95 వేల కేసులు, 340కిపైగా మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీలో మరో 52 వేలమంది కొవిడ్​ బారినపడ్డారు. మృతుల సంఖ్య 100లోపే ఉంది.
  • బ్రెజిల్​లో మరో 40 వేలకుపైగా, ఆస్ట్రేలియాలో 35 వేలమందికి వైరస్​కు సోకింది.

ఇవీ చదవండి:'దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే కొత్త చట్టం'

మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన.. 'షికాగో' రేడియో స్పీకర్స్‌!

ABOUT THE AUTHOR

...view details