India covid cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 13,154 కేసులు వెలుగుచూశాయి. మరో 268 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,486 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది.
- మొత్తం కేసులు: 3,48,22,040
- మొత్తం మరణాలు: 4,80,860
- యాక్టివ్ కేసులు: 82,402
- కోలుకున్నవారు: 3,42,58,778
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 63,91,282 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,83,22,742కు చేరింది.
Covid world cases
అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 16 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 4.65 లక్షల కేసులు నమోదయ్యాయి. 1,777 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,44,272కు పెరిగింది.
- ఫ్రాన్స్‌లో 2 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 184 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,372కు చేరింది.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 83 వేల కేసులు నమోదయ్యాయి. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- స్పెయిన్‌లో ఒక్కరోజే లక్ష కరోనా కేసులు బయటపడ్డాయి. 78 మంది కరోనాతో మరణించారు. పది లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- ఇటలీలో 98 వేల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,854,428కు పెరిగింది. మరణాల సంఖ్య 137,091కు చేరుకుంది.
ఇదీ చదవండి:బ్రిటన్‌లో కొవిడ్ పంజా.. తొలిసారి లక్షకుపైగా కేసులు