India Covid Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 1,150 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 83 మంది మరణించారు. 1,194 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు పడిపోయింది.
• యాక్టివ్ కేసులు: 11,365
• మరణాలు: 5,21,656
• మొత్తం కేసులు: 4,30,34,217
• రికవరీలు: 4,24,99,983
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 14,79,544 మందికి శుక్రవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.55 కోట్లకు చేరింది. 4,66,362 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,34,29,395 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 10,87,407 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,633 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో 205,289 కరోనా కేసులు నమోదయ్యాయి. 373 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో తాజాగా 169,454కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 336 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో 148,768 కరోనా కేసులు బయటపడ్డాయి. 139 మంది మృతి చెందారు.
- ఇటలీలో 66,535కొవిడ్ కేసులు నమోదయ్యాయి.144 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 59,029మంది వైరస్ సోకింది. మరో 31 ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:శరద్‌పవార్ ఇంటిపై ఉద్యోగుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత