తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 1,259 కరోనా కేసులు - ఇండియా కరోనా కేసులు

Covid Cases India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 1,259 మంది వైరస్ బారినపడ్డారు. మరో 35 మంది వైరస్​ కారణంగా మరణించారు.

india Cororna Cases
కరోనా

By

Published : Mar 29, 2022, 9:30 AM IST

Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 1,259 మందికి వైరస్​ సోకింది. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,705 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం మరో 25,92,407 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,53,90,499కు పెరిగింది.

  • మొత్తం కేసులు:4,30,21,982
  • మొత్తం మరణాలు:5,21,070
  • యాక్టివ్​ కేసులు:15,378
  • కోలుకున్నవారు:4,24,85,534

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి మరో 9,39,991 కొత్త కేసులు వెలుగు చూశాయి. 2,780 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,30,35,119కు చేరగా.. మృతుల సంఖ్య 61,51,470కు పెరిగింది. కరోనా ప్రభావం జర్మనీలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 2,14,035 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది.

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 1,87,213 287 1,20,03,054 15,186
2 వియత్నాం 1,20,000 70 90,11,473 42,306
3 జర్మనీ 2,14,035 159 2,04,65,072 1,29,106
4 ఫ్రాన్స్​ 29,455 124 2,50,59,028 1,41,821
5 ఇటలీ 30,710 95 1,43,96,283 1,58,877

ABOUT THE AUTHOR

...view details