తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 16,838 కేసులు, 113 మరణాలు - coronavirus deaths in India

దేశంలో తాజాగా 16,838 మందికి కరోనా సోకింది. మరో 100 మందికిపైగా వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజే 13 వేల మందికిపైగా కోలుకున్నారు.

India Coronavirus cases updates
స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- మళ్లీ 100 దాటిన మరణాలు

By

Published : Mar 5, 2021, 9:28 AM IST

భారత్​లో కొత్తగా 16,838 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 11 లక్షల 73 వేలు దాటింది. మరో 113 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 57 వేల 548కి చేరింది.

తాజాగా 13,819 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1,08,39,894 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. 1,76,319 క్రియాశీలక కేసులున్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1,80,05,503 మందికి టీకా పంపిణీ చేశారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు 21,99,40,742 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది.

ఇదీ చూడండి:కరోనాలో కొత్త ఉత్పరివర్తనలు, ప్రొటీన్లు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details