తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 12,286 మందికి కరోనా - కొవిడ్​ కేసులు

దేశంలో కొత్తగా 12,286 మంది కరోనా బారిన పడ్డారు. మరో 91 మంది మరణించారు. 12వేల మందికి పైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

India Coronavirus case and death updates
దేశంలో మరో 12,286 మందికి కరోనా

By

Published : Mar 2, 2021, 9:54 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 12,286 మందికి వైరస్ సోకింది. మరో 91 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరగా.. మరణాల సంఖ్య 1,57,248కి పెరిగింది.

తాజాగా 12,464 మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 1,68,358 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశంలో ఇప్పటివరకు 1,48,54,136 మందికి వ్యాక్సిన్​ అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

దేశంలో కొత్తగా 7 లక్షల 59 వేల మందికిపైగా కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మార్చి 1 నాటికి మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 21,76,18,057కు చేరింది.

ఇదీ చూడండి:వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక 'మ్యాప్‌లు'

ABOUT THE AUTHOR

...view details