India Corona cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కొత్తగా 2,706 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 25 మంది ప్రాణాలు విడిచారు. మరో 2,070 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,55,749
- మొత్తం మరణాలు: 5,24,611
- యాక్టివ్ కేసులు: 17,698
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,13,440
Vaccination India:దేశవ్యాప్తంగా ఆదివారం 2,28,823మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,31,57,352కు చేరింది. ఒక్కరోజే 2,78,267 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 3,27,598 మంది వైరస్ బారినపడ్డారు. మరో 552మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,15,26,656 కుచేరింది. మరణాల సంఖ్య 63,10,847కు చేరింది. ఒక్కరోజే 4,74,365 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,23,06,681గా ఉంది.
- తైవాన్‌లో ఒక్కరోజే 76,605 కొత్త కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 145 చనిపోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 26,787 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 30 మంది మృతిచెందారు.
- జపాన్‌లో కొత్త కేసులు 24,919 నమోదయ్యాయి. మరోవైపు.. ఫ్రాన్స్‌లో తాజాగా 16,440 కేసులు నమోదయ్యాయి.
- ఇటలీలో తాజాగా 14,826 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 27 మంది మృతి చెందారు.
ఉత్తర కొరియాలో కొవిడ్ ఉద్ధృతి: ఉత్తరకొరియాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,00,710 కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 70గా ఉంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 35,49,590కి చేరింది. వైరస్ బారినపడిన వారిలో 33,60,990 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి:దేశంలో మరో 2,828 కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు