తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Cases in India: దేశంలో కొత్తగా 1,660 మందికి కరోనా - ఇండియా కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 1,660 మంది వైరస్ బారినపడ్డారు.

india corona cases
కరోనా కేసులు

By

Published : Mar 26, 2022, 9:34 AM IST

Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 1,660 మందికి వైరస్​ సోకింది. 2,349 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. శుక్రవారం మరో 29,07,479 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,82,87,68,476 కు పెరిగింది.

  • మొత్తం కేసులు:4,30,18,032
  • మొత్తం మరణాలు:5,20,855
  • యాక్టివ్​ కేసులు:16,741
  • కోలుకున్నవారు:4,24,80,436

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 15,87,733 కొత్త కేసులు వెలుగుచూశాయి. 4,566 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,95,54,734కు చేరగా.. మృతుల సంఖ్య 61,42,309కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,39,396 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది.

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 3,39,396 392 1,11,62,232 14,294
2 వియత్నాం 1,08,979 51 87,61,252 42,145
3 జర్మనీ 2,76,746 300 2,00,18,465 1,28,757
4 ఫ్రాన్స్​ 1,43,571 121 2,47,79,882 1,41,564
5 ఇటలీ 75,616 146 1,42,29,495 1,58,582

ABOUT THE AUTHOR

...view details