దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు- కొత్తగా 1,938 మందికి వైరస్ - ఇండియా కరోనా కేసులు
Covid Cases India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి . బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 1,938 మంది వైరస్ బారినపడ్డారు. మరో 67 మంది వైరస్ కారణంగా మరణించారు.
కరోనా కేసులు
By
Published : Mar 24, 2022, 9:11 AM IST
Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 1,938 మందికి వైరస్ సోకింది. మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,531 మంది వైరస్ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. బుధవారం మరో 31,81,809 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,82,23,30,356కు పెరిగింది. రోజూవారి పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉంది.
మొత్తం కేసులు:4,30,14,687
మొత్తం మరణాలు:5,16,672
యాక్టివ్ కేసులు:22,427
కోలుకున్నవారు:4,24,75,588
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 17,95,866 కొత్త కేసులు వెలుగుచూశాయి. 4,671 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,59,85,004కు చేరగా.. మృతుల సంఖ్య 61,27,524కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 4.9లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది.