తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1,270 మందికి వైరస్​ - ఇండియా కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కొత్తగా 1,270 మంది వైరస్ బారినపడ్డారు. మరో 31 మంది వైరస్​తో మరణించారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Mar 28, 2022, 9:28 AM IST

Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కొత్తగా 1,270 మందికి వైరస్​ సోకింది. 31 మంది వైరస్​తో మరణించారు. 1,567 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం మరో 4,20,842 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,26,35,673 కు పెరిగింది.

  • మొత్తం కేసులు:4,30,20,723
  • మొత్తం మరణాలు:5,21,035
  • యాక్టివ్​ కేసులు:1,5859
  • కోలుకున్నవారు:4,24,83,829

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 9,90,066 కొత్త కేసులు వెలుగుచూశాయి. 2,354 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,18,59,745కు చేరగా.. మృతుల సంఖ్య 61,47,908కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,18,130 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది.

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 3,18,130 282 1,18,15,841 14,899
2 వియత్నాం 91,916 48 90,11,473 42,306
3 జర్మనీ 80,907 190 2,02,51,037 1,28,947
4 ఫ్రాన్స్​ 1,10,174 41 2,50,29,573 1,41,672
5 ఇటలీ 59,555 82 1,43,64,723 1,58,782

ABOUT THE AUTHOR

...view details