India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,68,063 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 277మంది మృతి చెందారు. 69,959 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,58,75,790
- మొత్తం మరణాలు:4,84,213
- యాక్టివ్ కేసులు:7,23,619
- మొత్తం కోలుకున్నవారు:3,45,70,131
ఒమిక్రాన్ వ్యాప్తి..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 92,07,700 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21,041,50 మందికి వైరస్ సోకింది. 4,608 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955కు చేరాయి.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం మరో 6,73,837 మందికి వైరస్ సోకింది. 1,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 6.26 కోట్లకు చేరింది.
- ఫ్రాన్స్‌లో కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. కొద్ది రోజులుగా రోజుకు 2 నుంచి 3 లక్షలు నమోదైన కేసులు సోమవారం 93,896 మాత్రమే నమోదయ్యాయి. మరో 280 మంది మరణించారు.
- బ్రిటన్‌లో మరో 1,42,224 మందికి వైరస్ సోకింది. 77 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 1,01,762 కొత్త కేసులు బయటపడగా.. 227 మంది మరణించారు. 56,560 మంది కోలుకున్నారు.
- స్పెయిన్‌లో 97,464 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 7,538,701కు చేరాయి.
- అర్జెంటీనాలో కొత్తగా 88,352 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 51 మంది మరణించగా.. మొత్తం కేసులు 6,399,196కు చేరాయి.
- ఆస్ట్రేలియాలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 72,573 మందికి వైరస్ సోకగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
- టర్కీలో కొత్తగా 65,236 కేసులు నమోదవగా.. 141 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 10,043,688, మరణాలు 83,834కు చేరాయి.
- కెనడాలో 55,350 కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. 73వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- బ్రెజిల్లో సోమవారం కొత్తగా 34,788 మందికి వైరస్ సోకింది. 111 మంది మరణిచారు.