India covid cases: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో కరోనా.. సునామిలా దూసుకుపోతుంది. రోజు వ్యవధిలోనే రెట్టింపు వేగంతో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 1,41,986 మందికి వైరస్ సోకింది. వైరస్ ధాటికి మరో 285 మంది చనిపోయారు. 40,895 మంది కొవిడ్‌ను జయించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 9.28 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 35,368,372
- మొత్తం మరణాలు: 4,83,178
- యాక్టివ్ కేసులు: 4,72,169
- మొత్తం కోలుకున్నవారు: 3,44,12,740
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 90,59,360 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,50,61,92,903కు చేరింది.
ఒమిక్రాన్ వ్యాప్తి..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 1,203 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దిల్లీలో 513 మందికి కొత్త వేరియంట్ సోకింది.
వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు
corona cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నమోదైన.. 27,05,435 కేసులతో.. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 30.36 కోట్లు దాటింది. మరో 6,380 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 54,96,806కు చేరింది.
- అమెరికాలో మరో 8,49,181 మంది కొవిడ్ బారిన పడ్డారు. 2,025 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 8,58,346కి చేరింది.
- ఫ్రాన్స్‌లో తాజాగా 3,28,214 కరోనా కేసులు నమోదయ్యాయి. 193 మంది మరణించారు.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,78,250 కేసులు వెలుగుచూశాయి. 229 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- స్పెయిన్‌లో తాజాగా 1,15,900 మంది కరోనా సోకింది. 15 మంది చనిపోయారు.
- ఇటలీలో కొత్తగా 1,08,304 కేసులు బయటపడ్డాయి. 223 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
ఇదీ చూడండి:కరోనా కల్లోలం- 71 శాతం పెరిగిన కేసులు