Covid Cases in India: దేశంలో మరోసారి కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు ఒక్కరోజే 17,336 మంది వైరస్ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 13,029 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,362,294
- మొత్తం మరణాలు: 5,24,954
- యాక్టివ్ కేసులు: 88,284
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,49,056
Vaccination India: భారత్‌లో గురువారం 13,71,107 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది. మరో 4,01,649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 7,25,222 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,650 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 547,326,664కు చేరింది. మరణాల సంఖ్య 6,347,476కు చేరింది. ఒక్కరోజే 463,579 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042గా ఉంది.
- జర్మనీలో ఒక్కరోజే 119,360కొత్త కేసులు బయటపడగా.. 98 మంది మరణించారు.
- అమెరికాలో 96,702 కేసులు వెలుగుచూశాయి. 266 మందికిపైగా చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 79,582 కొత్త కేసులు నమోదుకాగా.. 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 69,23 కేసులు నమోదు కాగా.. 346 మంది మరణించారు.
- ఇటలీ ఒక్కరోజే 56,166 మంది కొవిడ్ బారినపడగా..75 మంది ప్రాణాలు కోల్పోయారు.