తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2021, 9:43 AM IST

Updated : Aug 19, 2021, 10:15 AM IST

ETV Bharat / bharat

Corona Update: దేశంలో కొత్తగా 36 వేల కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య(Corona Update) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 36,401 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 530 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

india cases
కరోనా కేసులు

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య(Corona Update) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 36,401 మంది వైరస్ బారినపడ్డారు. మరో 530 మంది మరణించారు. కొత్తగా 39,157 మంది కరోనా​ను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 3,64,129గా ఉంది. 149 రోజుల తర్వాత ఇదే అత్యల్పం.

  • మొత్తం కేసులు: 3,23,22,258
  • మొత్తం మరణాలు: 4,33,049
  • మొత్తం కోలుకున్నవారు: 3,15,25,080
  • యాక్టివ్ కేసులు: 3,64,129

వ్యాక్సినేషన్..

దేశంలో బుధవారం 18,73,757 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య అరకోటి (50,03,00,840)దాటింది. ఒక్కరోజే 56,36,336 వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 56,64,88,433 టీకా డోసులు పంపిణీ చేశారు.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,94,807 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,555 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,01,08,057 కి చేరగా.. మరణాల సంఖ్య 44,05,573కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 1,58,000
  • బ్రెజిల్-​ 41,017
  • ఫ్రాన్స్-​ 28,405
  • బ్రిటన్​- 33,904
  • రష్యా- 20,914

ఇవీ చదవండి:R-value Drops: ఊరట కలిగిస్తున్న ఆర్‌ ఫ్యాక్టర్‌!

పిల్లలకు కొవిడ్​ టీకాపై ఎన్ఐవీ కీలక ప్రకటన

Last Updated : Aug 19, 2021, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details