తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కేసులు.. తగ్గిన మరణాలు - america covid cases

India Covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 8,582 మందికి వైరస్​ సోకింది. మహమ్మారితో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

corona cases indiaCORONA CASES
corona cases indiaCORONA CASES

By

Published : Jun 12, 2022, 9:18 AM IST

Updated : Jun 12, 2022, 9:49 AM IST

India Covid Cases: భారత్​లో కొవిడ్​ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 8,582 మంది వైరస్​ బారిన పడ్డారు. మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు విడిచారు. శనివారం 4,143 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.69 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.1 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.71 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,214,777
  • మొత్తం మరణాలు: 5,24,761
  • యాక్టివ్​ కేసులు:44,513
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,52,743

Vaccination India: భారత్​లో శనివారం 13,04,427 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,07,08,541 చేరింది. మరో 3,16,179 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 382,377 కేసులు వెలుగుచూశాయి. మరో 929 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 540,136,732కు చేరింది. మరణాల సంఖ్య 6,330,785కు చేరింది. ఒక్కరోజే 392,212 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 514,062,612గా ఉంది.

  • తైవాన్​లో 79,663 కొవిడ్​ కేసులు, 211 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 44,642 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో 65 మంది ప్రాణాలు కోల్పయారు.
  • ఉత్తర కొరియాలో 42,810కేసులు నమోదయ్యాయి.
  • అమెరికాలో 39,743 కొత్త కేసులు, 74 మరణాలు వెలుగుచూశాయి.
  • బ్రెజిల్​లో 32,332 మంది వైరస్​ బారిన పడ్డారు. 127 మంది చనిపోయారు.
Last Updated : Jun 12, 2022, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details