India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 5,233 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 3345 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.07 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.12% గా వద్ద ఉంది. 93 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఐదువేలకు పైగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కరోనా కేసులు:4,31,90,282
- మొత్తం మరణాలు: 5,24,715
- యాక్టివ్ కేసులు:28,857
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,36,710
Vaccination India: భారత్లో మంగళవారం 14,94,086 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది. మరో 3,13,361 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.