India Corona cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరో 4,041 మంది వైరస్ బారినపడ్డారు. దాదాపు 84 రోజుల తర్వాత.. కేసులు 4 వేల మార్కును దాటాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.73గా ఉంది. ఒక్కరోజే 10 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గురువారం 2363 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. గురువారం కూడా మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే మరో 1045 మంది కొవిడ్ బారినపడ్డారు. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 4559కు పెరిగాయి. ఇందులో సగానికిపైగా ముంబయి నుంచే ఉన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.
- దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,68,585
- మొత్తం మరణాలు: 5,24,651
- యాక్టివ్ కేసులు: 21,177
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,22,757
Vaccination India: దేశవ్యాప్తంగా గురువారం 12,05,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,83,72,365కు చేరింది. ఒక్కరోజే 4,25,379 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.