India Corona cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 4,270 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే 15 మంది చనిపోయారు. శనివారం 2,619 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
- దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,76,817
- మొత్తం మరణాలు: 5,24,692
- యాక్టివ్ కేసులు:24,052
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,28,073
Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 11,92,427 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,09,46,157కు చేరింది. మరో 4,13,699 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.