India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 3,714 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఆరుగురు కేరళకు చెందినవారే. సోమవారం 2513 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.06 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.21 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.97% గా వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,85,049
- మొత్తం మరణాలు: 5,24,708
- యాక్టివ్ కేసులు:26,976
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,33,365
Vaccination India: భారత్లో సోమవారం 13,96,169 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది. మరో 3,07,716 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.