దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 2,81,386 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 4,106 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు:2,49,65,463
- మొత్తం మరణాలు:2,74,390
- కోలుకున్నవారు:2,11,74,076
- యాక్టివ్ కేసులు:35,16,997
ఆదివారం 15,73,515 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 31,64,23,658కి చేరినట్లు వెల్లడించింది.