భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 26,291 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య కోటీ 13 లక్షల 85 వేలు దాటింది. మహమ్మారికి ధాటికి మరో 118మంది బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,13,85,339
- యాక్టివ్ కేసులు: 2,19,262
- మరణాలు: 1,58,725
- కోలుకున్నవారు: 1,10,07,352
ఆదివారం మరో 17,455 మంది వైరస్‌ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,99,08,038 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు చెప్పింది.