తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు - covid rules

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒక్కరోజే 1335 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

India corona cases
India corona cases

By

Published : Apr 1, 2022, 9:22 AM IST

Covid Cases India: భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగా 1335 మందికి వైరస్​ సోకింది. మరో 52 మంది వైరస్​తో మరణించారు. 1918 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గురువారం మరో 23,57,917 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,84,31,89,377కు పెరిగింది. దేశంలో యాక్టివ్​ కేసులు 0.03శాతానికి చేరాయి. ఇప్పటివరకు 98.76 శాతం మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 6,06,036 కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం.

  • మొత్తం కేసులు:4,30,25,775‬
  • మొత్తం మరణాలు:5,21,181
  • యాక్టివ్​ కేసులు:13,672
  • కోలుకున్నవారు:4,24,90,922

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం అన్ని దేశాల్లో కలిపి మరో 14 లక్షల 41 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. దాదాపు మరో 4 వేల మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,81,91,383కు చేరగా.. మృతుల సంఖ్య 61,66,429కి పెరిగింది. కరోనా ప్రభావం జర్మనీ, దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. ద.కొరియాలో ఒక్కరోజే 3 లక్షల 20 వేలు, జర్మనీలో 2 లక్షల 57 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details