తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 149 మంది మృతి - ప్రపంచ కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 1,421 మంది వైరస్ బారినపడ్డారు. 149 మంది వైరస్​తో మరణించారు.

India Covid cases
ఇండియా కరోనా కేసులు

By

Published : Mar 27, 2022, 9:26 AM IST

Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 1,421 మందికి వైరస్​ సోకింది. 149 మంది వైరస్​తో మరణించారు. 1,826 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. శనివారం మరో 29,90,658 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,20,10,030 కు పెరిగింది.

  • మొత్తం కేసులు:4,30,19,453
  • మొత్తం మరణాలు:5,21,004
  • యాక్టివ్​ కేసులు:16,187
  • కోలుకున్నవారు:4,24,82,262

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 12,29,670 కొత్త కేసులు వెలుగుచూశాయి. 3,065 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,08,43,258కు చేరగా.. మృతుల సంఖ్య 61,45,501కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,35,479 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది.

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 3,35,479 323 1,14,97,711 14,617
2 వియత్నాం 1,03,126 62 89,19,557 42,258
3 జర్మనీ 1,51,665 300 2,01,70,130 1,28,757
4 ఫ్రాన్స్​ 1,39,517 67 2,49,19,399 1,41,631
5 ఇటలీ 73,357 118 1,43,04,111 1,58,700

ABOUT THE AUTHOR

...view details